పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో జెడ్పీటీసీ బెల్లం శ్రీను పుట్టినరోజు వేడుక

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 30 (ప్రజాబలం) తిరుమలాయపాలెం స్థానిక జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ తన జన్మదిన వేడుకను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో జరుపుకున్నారు. గడపగడపకు కాంగ్రెస్ లో భాగంగా సోమవారం ప్రసాద్ రెడ్డి బచ్చోడుకు రాగా.. ఈ కార్యక్రమానికి హాజరైన బెల్లం శ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ సహాయం అరవింద్ రెడ్డి నివాసంలో బెల్లం శ్రీనివాస్ చేత కేక్ కట్ చేయించి, ప్రసాద్ రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని కేక్ తినిపించారు నిరంకుశ పాలనను అంతమొందించేందుకు పొంగులేటి శీనన్నను అంతా కలిసి భారీ మెజారిటీతో గెలిపించు కుందామని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి, కొప్పుల అశోక్, బచ్చోడు సర్పంచ్ రామ సహాయం అనిత రెడ్డి, హస్నాబాద్ సర్పంచ్ బొబ్బిలి భరత్ చంద్ర, మోరపాక నాగయ్య, కట్కూరి శ్రీనివాసరెడ్డి, వనవాసం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking