పరికిబండ , రంగయపల్లి గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను కొనుగోలు కేంద్రం సెంట్రల్ ప్రారంభించిన అధికారులు.
మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరిధిలోని నాలుగు గ్రామాలలో ఖరీఫ్ సీజన్ కు ఐకెపి ద్వారా వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు
1)పరికిబండ 2)లింగారెడ్డిపేట్ 3)రంగయ్యపల్లి4) కుచారం ఈ గ్రామాలలో సెంట్రల్ ఏర్పాటు చేశారు. జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు సెంటర్లను మన మండల గౌరవనీయులు స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి సార్ మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో , మండల సమైక్య అధ్యక్షురాలు స్వప్న చేతుల మీదుగా ఈ రెండు సెంటర్లు 1) రంగయ్యపల్లి
2) పరికి బండ గ్రామాల్లో
ప్రారంభించారు.
స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులందరూ కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఐకెపి వారి ధాన్యం కొనుగోలు సెంటర్లు మరియు ప్యాక్స్ ద్వారా అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది దళారుల దగ్గరికి పోయి నష్టపోకుండా గిట్టుబాటు ధర కొనుగోలు సక్రమంగా ఉండేటట్లు ఉంటాయని ఎటువంటి నష్టాలు జరగకుండా మన ప్రభుత్వ సెంటర్లలో ఉంటాయని చెప్పడం జరిగింది మరియు దళారుల దగ్గరికి పోకుండా ఐకెపి సెంటర్లు మరియు ప్యాక్ సెంటర్ దగ్గర వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పారు .
ఐకెపి సెంట్రించార్జిలకు రైతుకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని మరియు అగ్రికల్చర్ అధికారులకు సక్రమంగా రైతులకు సమస్యలు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు స్వప్న ఏపిఎం పెంటా గౌడ్ ఏ ఈ ఓ నరేందర్ గౌడ్ పంచాయతీ సెక్రటరీలు భాస్కర్ కవిత నర్సింలు, సీసీలు విజయలక్ష్మి, శోభారాణి, గ్రామ సంఘం లీడర్లు వివోఏలు రైతులు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
