30 అక్టోబర్ 2023 ప్రజాబలం ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని రాణి రుద్రమ ఎంపికపై వ్యతిరేకంగా ఈరోజు జిల్లాలోని భాజపా ముఖ్య నాయకులు తమ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు తాము పార్టీ కోసం చేసిన కృషిని త్యాగాలను గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం కాషాయ జెండా పట్టుకొని బీజేపీ లో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి సిరిసిల్ల లో రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమంలను తూచా తప్పకుండా ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమించానని రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్, జిల్లా అధికార ప్రతినిధి అన్నల్ దాస్ వేణు తెలిపారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్న అంటే దానికి కారణం నా మాతృ సంస్థ ఏబీవీపీ. కానీ రాష్ట్ర నాయకత్వ లోపము వల్ల బీజేపీ పరిస్థితి ఇలా తయారైందని తెలిపారు. 2014 నుండి పారశుట్ లీడర్లకు,బయటి వ్యక్తులకు,అణమకులకు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి స్థానిక నాయకుల అభిప్రాయం లను రాష్ట్ర నాయకత్వం తుంగ లో తొక్కి మమ్మల్ని చాలా మనోవేదనకు గురి చేశారని పేర్కొన్నారు. మరి ఏనాడైతే రాష్ట్రంలో బీజేపీని ఒక స్థాయికి తీసుకెళ్లిన ఎంపీ బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించిన రోజే తెలంగాణ లో బీజేపీ పరిస్థితి శూన్యం అయిందన్నారు . సిరిసిల్లలో స్థానికుడికి టికెట్ ఇస్తారని కానీ గతంలో పాలకులు ఉండి పార్టీని నాశనం పట్టించిన వ్యక్తి అయిన ఒక అనామకురాలు అయిన రాణి రుద్రమకు ఎలా టికెట్ ఇస్తారు అని ప్రశ్నించారు.
సిరిసిల్ల స్థానికులు ఒక్కరు కనిపించలేరా అని మండిపడ్డారు. స్థానిక నేతలకు అవకాశం కల్పించిన మేం కష్టపడి గెలిపించుకునేవాళ్ళమని చెప్పారు.
రాణి రుద్రమ మూలంగానే సిరిసిల్ల బీజేపిలో చీలీకలు వచ్చాయని వెల్లడించారు.
రాత్రికి రాత్రి తీసుకువచ్చి మళ్లీ ఆమెకే టికెట్ కేటాయించడం సరికాదని, కార్యకర్తలు, నాయకులకు విలువ లేదు, టికెట్ ఇచ్చే ముందు కనీసం సూచనప్రాయంగానైన మా అభిప్రాయాలు సేకరించలేదు అని మండిపడ్డారు.
ఎన్నో ఏండ్లో కష్టనష్టాలకు ఓర్చి పార్టీ కష్టపడితే మాకిచ్చే గౌరవం ఇదేనా అని తమ ఆవేదనను తెలిపారు.
ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తులన్నరు. రాణి రుద్రమ ఏ దరఖాస్తు పెట్టుకుందని టికెట్ ఇచ్చారు.
రాణి రుద్రమ సిరిసిల్లకు వచ్చినప్పటి నుంచి నాపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడింది. రాజకీయంగా నన్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేసింది. ఆమె వైఖరిని మొదటి నుంచి నేను వ్యతిరేఖిస్తు వస్తున్నాను. కానీ బీజేపి రాష్ట్ర నాయకత్వం మళ్లీ ఊరు కానీ ఆమెకు. సిరిసిల్లకు సంబంధం లేని వ్యక్తికి బీజేపి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం సిరిసిల్ల బీజేపి కార్యకర్తలను అవమనించడమే కావున
బీజేపీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిత్వంని వ్యతిరేకిస్తూ నా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కి ,జిల్లా అధికార ప్రతినిధి, రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ పదవులకు రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. ఆయనతో పాటు తంగాళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సురువు వెంకటి,బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు,బిజెవైఎం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్,బీజేపీ దళిత నాయకులు కంసాల మల్లేశం,బిజెవైఎం పట్టణ నాయకులు సిరిసిల్ల సాయికృష్ణ, గడ్డం హరీష్ ఎల్గం అభిలాశ్, నెరేళ్ల శ్రీధర్, కసర్ల ప్రసాద్ ,బొల్లి నవీన్,రచ్చ రాహుల్,బాల్యాల జనార్దన్n తో పాటు దాదాపు 50 మంది నాయకులు, కార్యకర్తలు వారి ప్రాధమిక సభ్యత్వానికి,పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.