డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 15:
డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్ లో 78వ స్వాతంత్రదినోత్సవ
వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ నవనీత రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ హాజరయ్యారు. పాఠశాల చైర్మన్ నవనీత రావు జాతీయ జెండా ఆవిష్కరించి
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు త్రివర్ణ రంగుల దుస్తులతో పాఠశాలకు వచ్చి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుమా మీనన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరుల అన్నారు, దేశాభివృద్ధికి తోడ్పడాలని ప్రోత్సహించారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాలలో జెండా వందనం, క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు, మరియు వర్ధమాన చిత్ర నిర్మాతలకు షార్ట్ మూవీ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో దేశభక్తి గీతాలు, చారిత్రక ఘట్టాల ఆధారంగా రంగస్థల ప్రదర్శనలు, విప్లవకారులు, జాతీయోద్యమ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ఎంతగానో అలరించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రముఖులు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోర్ హెడ్ ఆపరేషన్స్ కిషోర్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిస్సిపాల్స్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking