సహకార సంఘాలకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా వికసిత భారత్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : గ్రామీణ స్థాయిలో ఉన్న సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా వికసిత భారత్కు పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.71 వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ అర్బన్ సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా సహకార శాఖ అధికారి బి.సంజీవ రెడ్డితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా సహకార మంత్రిత్వ శాఖ ద్వారా 56 అంశాలలో సహకార రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందని,అన్ని రకాల సహకార సంఘాలకు సరైన ప్రాధాన్యత కల్పించడిందని, సంఘాలు పరస్పర సహకారంతో ప్రగతి పథంలో రాణించాలని తెలిపారు.ప్రభుత్వం నుండి అందించవలసిన అన్ని రకాల సేవలను అందించేందుకు జిల్లా సహకార శాఖ సిద్ధంగా ఉందని, గోదాములు, పెట్రోల్ బంక్లు, ఖాళీ స్థలాలు అందించేందుకు అనుకూలంగా ఉన్నామని, మహిళా సంఘాలకు సోలార్ పరిశ్రమలు, క్యాంటీన్లు తదితరాలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లాలో ప్రగతి కనబరిచిన సంఘాలకు జ్ఞాపికలు, బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో విశిష్ట కాకతీయ సహకార శిక్షణ కేంద్రం-వరంగల్ ప్రిన్సిపల్ లూనవత్ యాకూబ్ నాయక్, బ్యాంక్ చైర్మన్ వినయ్కుమార్, సి.ఈ.ఓ. మూర్తి, సహకర శాఖ అధికారులు కె.రవీందర్రావు, మల్లారెడ్డి, హన్మంతరెడ్డి, రవికిషోర్,సందీప్ కుమార్,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ లు కార్యదర్శులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking