గ్రూప్-3 పరీక్ష కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న గ్రూప్ -3 పరీక్ష కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో పరీక్ష నిర్మాణ కొరకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,15 వేల 38 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్ష నిర్వహణ కొరకు నోడల్ అధికారి, పోలీస్ నోడల్ అధికారి,రీజియన్ కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందని,ప్రతి పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు,శాఖ అధికారులు, ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్,రూట్, జాయింట్ రూట్ అధికారులు,ఫ్లయింగ్ స్క్వాడ్ల ను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని, త్రాగునీరు, మూత్రశాలలు, నిరంతర విద్యుత్ సరఫరా ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8:30 గంటలు, మధ్యాహ్నం 2 గంటల లోపు పరీక్ష కేంద్రానికి రావాలని, ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు గేట్లు మూసివేయడం జరుగుతుందని, తదుపరి ఎవరిని అనుమతించడం జరగదని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు,పాస్ పోర్టు,పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు), నలుపు, నీలం బాల్ పెన్నులు తెచ్చుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, పేజర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాలిక్యులేటర్, ఎనలాగ్/ డిజిటల్ గడియారాలు, బ్లూటూత్లు లోపలికి అనుమతించబడవని తెలిపారు.హాల్ టికెట్, వెరిఫికేషన్ కొరకు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష ఓ.ఎం.ఆర్. విధానం ద్వారా జరుగుతుందని, అభ్యర్థులు హాల్ టికెట్ ప్రకారం వారికి కేటాయించిన గదులలోకి సమయానికి వెళ్లాలని తెలిపారు. ఈ నెల 17న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1,మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2,18వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్- 3 పరీక్షలు ఉంటాయని,ప్రతి పేపర్ 150 ప్రశ్నలు కలిగి 150 మార్కులకు ఉంటుందని తెలిపారు. ఉదయం పరీక్షకు మధ్యాహ్నం 12:30 గంటలు, మధ్యాహ్నం పరీక్షకు సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం గదిలోనే ఉండాలని,పరీక్ష రాసిన అనంతరం ఓ. ఎం.ఆర్.షీట్లను ఆయా ఇన్విజిలేటర్లకు అందించి పరీక్ష ప్రశ్నాపత్రమును తీసుకువెళ్లవచ్చని తెలిపారు.అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking