జిల్లాలో విశిష్ట సేవలు అందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 05 : జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలక మండలి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్న అనంతరం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ విశిష్ట సేవలు అందించడం జరుగుతుందని ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చెరువుగా కావాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలు విస్తృత పరిచి కార్యచరణ ప్రకారం నిరంతరంగా సేవలు అందించాలని తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి ఎన్నికల అధికారి నరసయ్య 15 మంది సభ్యులు తో కూడిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలక మండలిని ప్రకటించారు. జిల్లా చైర్మెన్ గా కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బొప్పు సతీష్, కోశాధికారిగా శరత్ కుమార్, ఉదారి చంద్రమోహన్,పవన్ కుమార్ తివారి,కేశెట్టి సంతోష్ కుమార్,ములుకల్ల సత్యనారాయణ రెడ్డి,కుటుకం హరీష్,బుద్దినేని సత్యనారాయణరావు,చుంచు శంకరయ్యను,ఎన్నికున్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking