అనాథశ్రమాలు కనీస ప్రమాణాలు తప్పనిసరి సారి పాటించాలి

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రెడ్డి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 05 : జిల్లాలోని పిల్లలు సంక్షేమం కోసం పని చేసే అనాథ శ్రమాలు కనీస ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్ర్తీ,శిశు,దివ్యాంగులు, వయోవృద్ధులు,సంక్షేమ శాఖ అధికారి కె.చిన్నయ్యతో కలిసి జిల్లా పిల్లల సంక్షేమం కోసం పని చేస్తున్న అనాథ శ్రమాలు బాలల రక్షణ చట్ట ప్రకారం కనీసం, ప్రమాణాలు పాటించాలని తెలుపారు.జిల్లాలో అన్ని అనాథ శ్రమలను పరిశీలన కమిటీ ఇప్పటికే సందర్శించిని,జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించాలని,నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్ ఆనంద్,ఇన్ స్టిట్యూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి.సత్తయ్య, అనాథశ్రమాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking