ప్రజా పాలన సేవ కేంద్రాల ద్వారా గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్ వేర్ లో నమోదుచేయలి నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

మంగళవారం హైదరాబాద్ నుండి విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు,సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునీకి గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని,ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో, అదేవిధంగా మున్సిపాలిటీలలో అవసరమైన మేర ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం కింద క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేశామని,తెల్ల రేషన్ కార్డు వివరాలు,ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింక్ ఉన్న దరఖాస్తుదారులకు ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. గృహ జ్యోతి కింద ఎంపికైన లబ్ధిదారులకు జీరో బిల్లులు పంపిణీ చేస్తున్నామని,ప్రజా పాలన దరఖాస్తు సమయంలో వివరాలు సరిగ్గా నమోదు చేసుకొని దరఖాస్తుదారులు, నూతన ప్రజా పాలన దరఖాస్తుల సైతం ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా సమర్పించవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు తమ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు,గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలను ప్రజాపాలన సేవా కేంద్రాలలో గృహ జ్యోతి,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలలో అర్హులు వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా పాలన సేవా కేంద్రాల్లో వినియోగించే సాఫ్ట్వేర్ పనితీరును రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒక తెల్ల రేషన్ కార్డు పై ఒక గ్యాస్ కనెక్షన్, ఒక విద్యుత్ మీటర్ కనెక్షన్ కు మాత్రమే గ్యారెంటీ పథకాలు వర్తిస్తాయని అన్నారు. ప్రజా పాలన సేవా కేంద్రాలలో అవసరమైన మేర దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజాపాలన సేవా కేంద్రాలో విధుల నిర్వహణ, సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదుపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని ఆయన కలెక్టర్ లకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిడిఓ, మున్సిపాల్ కార్యాలయాలలో ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సేవా కేంద్రాలలో గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్, గ్యాస్ పాస్ బుక్, ద్వారా కేంద్రాలలో సరి చేసేలా అధికారులకు సూచనలు చేయడం జరిగిందని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking