బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం

 

   బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

హైదరాబాద్, ఆగస్టు22  : రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసే తమ అభ్యర్థులను ప్రకటించారని, బిఆర్ ఎస్ పార్టీ అబ్యర్థుల జాబితాలో 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లు, ఐదు శాతం ఉన్న రెడ్లకు 33%, అరశాతం ఉన్న వెలమలకు 16% టికెట్లుకేటాయించి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా నిరూపించుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవత స్థాయిలో విరుచుక పడ్డారు. కాచి గూడా  లో మీడియా సమావేశం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జూలపల్లి కిరణ్,  లతో కలిసి మాట్లాడారు.బిఆర్ఎస్ బీసీలకు కేవలం గతంలో కంటే తక్కువగా 23 టికెట్లు కేటాయించి బీసీలను అవమానించిందని, బి ఆర్ ఎస్ పార్టీకి కెసిఆర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఈరోజు బీసీలకు కేటాయిం చినటు వంటి టికెట్ల కేటాయింపే నిదర్శనం అని ఆయన అన్నారు, బీసీలకు పచ్చి మోసం చేసిన బి ఆర్ ఎస్ పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి బీసీల సిద్ధం సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు, రెడ్లకు, వెలమలకు టికెట్ల కేటాయింపుల్లో పెద్దపీట వేసి, బి ఆర్ ఎస్ పార్టీ అంటే అగ్రవర్ణాల సమితిగా మారిందని ఆయన ఆరోపించారు. ఆధిపత్య కులాల వారికి సిట్టింగ్ సీట్లు ఇచ్చి తెలంగాణలో అగ్రకులాల పాలనను కేసీఆర్ శాశ్వతం చేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే 115 మందిలో 65 మంది అగ్రకులాలకు టికెట్లు ఇవ్వడం చాలా సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, బీసీ కోర్ కమిటీ మెంబెర్స్, బీసీ సీనియర్ లీడర్స్, విద్యార్థి నాయకులూ, యువజన విభాగం, మహిళా విభాగం, బీ

Leave A Reply

Your email address will not be published.

Breaking