మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 18:తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు ఈనెలలో కూడా ఉదయం ఎనిమిది గంటలకు ప్రతి పాఠశాలలో విజయవంతంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమం ప్రతి పాఠశాలలో మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్నప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఐ విజయ కుమారి గారు వర్చువల్ విధానంలో జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి పాఠశాలలో హాజరైన తల్లిదండ్రులతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు శ్రీమతి దేవసేన IAS గారు కూడా ఈ జూమ్ మీటింగ్లో హాజరై జిల్లాలోని వివిధ పాఠశాలల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఈ పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి మంచి వాతావరణం లో విద్యార్థులు చదువుకునే విధంగా అటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరించి విద్యార్థులు యొక్క ఉన్నత భవిష్యత్తుకు చేయూతనివ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గారితో జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడిన తల్లిదండ్రులు ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను విద్యార్థుల పట్ల చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధను ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించడం జరిగింది.