మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 18:కేంద్ర విద్యాశాఖ NCERT /NIEPA వారి ద్వారా అందజేసే జాతీయ ఇన్నోవేషన్ అవార్డు విద్యాశాఖ విభాగానికి జాతీయస్థాయిలో నామినేషన్లను స్వీకరించిన తర్వాత వివిధ స్థాయిలలో జాతీయస్థాయి నిపుణులు వాటిని షార్ట్ లిస్టు చేసి అందులో అత్యంత ప్రభావితమైన ఇన్నోవేషన్ కు జాతీయస్థాయిలో విద్యాశాఖ అధికారులకు వారి ఇన్నోవేషన్స్ ఆధారంగా అవార్డులు ఇస్తారు. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా విద్యాశాఖ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో చేపట్టిన ఇన్నోవేటివ్ కార్యక్రమం మేడ్చల్ బడి డాట్ కామ్ నిర్మాణం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కొరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాటాలను నాణ్యతగా తయారుచేసి విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క వెబ్సైట్లో తయారు చేసినందుకు గాను దేశంలోని అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల ఇన్నవేషన్స్ తో పోటీపడి ఈరోజు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో చేపట్టిన ఇన్నోవేషన్ కు అవార్డు దక్కడం జరిగింది. ఈ అవార్డు ను ఈనెల 23వ తేదీన కేంద్ర విద్యా శాఖ మాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఐ విజయ కుమారి గారు అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులు మరియు జిల్లాలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.