ఖమ్మం ప్రతినిధి మార్చి 19 (ప్రజా బలం) ఖమ్మం కమ్మవారి కల్యాణ మండపం ఏన్కూర్ లో కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం పుల్లయ్య – రాములమ్మ ల మనవడు ఉమామహేశ్వరరావు – సాయి అనూష ల వివాహ కార్యక్రమం లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు. మరియు శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ ముచ్చర్లలో ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామ మాజీ సర్పంచ్ బోడ వెంకన్న – శాంతమ్మ ల ఏకైక పుత్రుడు పవన్ కుమార్- లావణ్య ల వివాహ కార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు షేక్ పతే మహమ్మద్, సోమనబోయిన, మల్లికార్జున్, మేకల మల్లికార్జున్,గడ్డం వెంకటేశ్వరరావు, లక్ష్మి, రాచ బంటి రామారావు,కోటేశ్వరి, భానోత్ వీరన్న ,గమ్మి, బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు