ఇన్స్ పైర్ మనక్ నామినేషన్లను వేగవంతం చేయాలి .

 

అన్ని యాజమాన్యాల లో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు
ఈ పోటీలలో పాల్గొనవచ్చు.

జిల్లా విద్యాధికారి, రాధాకృష్ణ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్లో ఇన్స్పైర్ మనక్ గోడపత్రికను
ఆవిష్కరణ.

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి

మెదక్, ఆగస్టు 20, 2024

ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుండి ఐదు నామినేషన్లను ఆన్లైన్లో సెప్టెంబర్ 15వ తేదీ లోపు అప్లోడ్ చేయాలని ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తో కలిసి ఇన్స్పైర్ మనక్ గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అర్హత గల అన్ని పాఠశాలల నుండి విద్యార్థుల నామినేషన్లను అప్లోడ్ చేసి జిల్లా నుండి ఎక్కువమంది ఎంపిక అయ్యేటట్లు కృషి చేయాలన్నారు….
దరఖాస్తు చేసుకునే విధానం… పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటీషన్ నిర్వహించి ఉత్తమమైన ఐదు ఆలోచనలను ఎంపిక చేసి ప్రతి పాఠశాల నుండి ఐదు నామినేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు
విద్యార్థి పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆధార్ నెంబర్ , విద్యార్థి ఫోటో ప్రాజెక్టు రైట్ అప్ ను అప్లోడ్ చేయాలన్నారు.
తదుపరి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి అర్హత కలిగిన ప్రాజెక్టులకు 10000/-(పది వేల రూపాయలు) సంబంధిత విద్యార్థి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారని చెప్పారు. వీటిని ఉపయోగించి ప్రాజెక్టు రూపొందించి జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొనాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking