తార్నాక ఎక్స్‌ రోడ్‌ ఓపెనింగ్‌ పనుల పరీశీలన

ఉప్పల్‌ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌: తార్నాక ఎక్స్‌ రోడ్‌ ఓపెనింగ్‌ పనులను గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి , టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్‌ రెడ్డి , జిహెచ్‌ఎంసి సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌ మరియు ఇతర జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ పనుల పురోగతి, వినియోగదారుల అవసరాలు, రోడ్డు డిజైన్‌, పాదచారుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పనుల ప్రాముఖ్యతను చర్చిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇకపై ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడానికి, రోడ్డు ప్రక్కన వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరుతం ఏర్పాటు చేయబోతున్న స్మార్ట్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌, సెంట్రలైజ్డ్‌ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీల వాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల సహకారం మరియు అధికారుల కృషితో ఈ పనులు త్వరగా పూర్తి కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking