చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం

 

413 కోట్లతో నిర్మాణం

వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 6:
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 413 కోట్లతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేసారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా ఓడిస్సా, జమ్ము, తెలంగాణ రాష్ట్రాలలో టెర్మినల్స్ ను ప్రారంభించడం ఎంతో హర్షనీయమన్నారు. తెలంగాణలోని హైదరాబాదులో సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడా లో ఉండే రద్దీ చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటు ద్వారా తగ్గుతుందని, అంతేకాకుండా వస్తురవాణా, వాణిజ్యా వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడడమే కాకుండా ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగ వసతుల కల్పన కలుగుతుందన్నారు. రానున్నరోజుల్లోఈ టెర్మినల్ కీలక పాత్ర పొషిస్తుందన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణరాష్ట్ర గవర్నర్ జిష్టు దేవ్ వర్మ, కేంద్ర రైల్వే మంత్రి సోమన్న, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఈటెలరాజేందర్, మాజీ శాసన సభ్యులు ప్రభాకర్ లు పాల్గొన్నారు.
సచివాలయం నుండి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొని చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించినందుకు గాను ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణాలో మెట్రొరైల్ విస్తరణకు, ఆర్ ఆర్ ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం, కీసర ఆర్డిఓ సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking