కలిసికట్టుగా పోరాడుదాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 07 : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లక్షెట్టిపేట మండలం లోని పాత కొత్త కొమ్ముగూడెం గ్రామాలలో మున్సిపాలిటీ పలు వార్డ్ లలో జై బాపు.జై భీమ్,జై సంవిధన్, అభియన్,రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిధిగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ పాల్గొనరు,ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, కలసికట్టుగా పోరాడుదాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము,అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణ చందర్ రావు,చింత అశోక్ కుమార్, మాజీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగ భూషణం,జిల్లా ఆర్ టి ఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షుడు అనిల్, మాజీ ఎంపీటీసీ సందేల సురేష్ మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్,సురేష్ నాయక్, బియ్యల తిరుపతి,కంది మోహన్ రాజు,కాంగ్రెస్ నాయకులు అన్నం చిన్నాన్న,పెద్ద ఎత్తున్న మండల మున్సిపాలిటీ కార్యకర్తలు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..