తెలంగాణకు నిధులు కేటాయించలేదని అనడం సమంజసం కాదు

అనంతరావు కులకర్ణి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఈరోజు పత్రిక విలేకరుల సమావేశంలో అనంతరావు కులకర్ణి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రాథమిక వేశాయ సహకార సంఘం చైర్మన్‌, శ్రీ నవాబు గారి భూమయ్య గారు మాజీ జెడ్పిటిసి ఆందోల్‌, శ్రీ కుమ్మరి పండరి గారు అధ్యక్షులు పుల్కల్‌ మండల్‌ బిజెపి పాల్గొన్నారు. అనంతరావు కులకర్ణి గారు మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో యావత్‌ భారతదేశం లోని మహిళలకు, రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా సరైన పద్ధతిలో బడ్జెట్‌ కేటాయించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు, నరేంద్ర మోడీ గారు చెప్పిన నినాదం సబ్కా సార్‌ సబ్కా వికాస్‌ ఈ పద్ధతిలో మహిళలకు వారి అభివృద్ధి కొరకు మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం, గ్రామీణ అభివృద్ధికి 266 లక్షలు కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంత హౌసింగ్‌ కి 22 లక్షల కోట్ల రూపాయలు, రైతులకు వ్యవసాయ అభివృద్ధి కొరకు 100 52 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం, యువకులకు ప్రధానమంత్రి ప్రకటించిన ఐదు స్కీములకు, విద్యార్థులకు 48 వేల కోట్ల రూపాయలను కేటాయించడం సబ్కా సార్‌ సబ్కా వికాస్‌ కి నిదర్శనమని వారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించలేదని అనడం సమంజసం కాదనిఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking