మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరిపే అనిల్ కుమార్ వంజరి
ప్రజాబలం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపడం తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడమే, ఇద్దరు కేంద్రమంత్రులు 8 ఎంపీలను బీజేపీ పార్టీకి తెలంగాణా ప్రజలు గెలిపించిన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరిపే అనిల్ కుమార్ వంజరి ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
రామంతపూర్ రాజీవ్ గాంధీ స్టాచ్యు దగ్గర మోడీ, నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి కోటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు అశోక్, ఎండ్ నరేం, రాజు, సత్యనారాయణ రెడ్డి, చింటూ, మహేందర్ రెడ్డి, నరేష్, ఇంద్రసేనారెడ్డి, విశాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.