ది అడ్వకేట్స్ సహకార గృహ నిర్మాణ సంఘం లి. కరీంనగర్ కు జరిగిన ఎన్నికల్లో విజేతల వివరాలు ఎస్ సి/ఎస్ టి కాటగిరి లో ఒక్క డైరెక్టర్ కు గాను ధనుక రాజశేఖర్ రావు, మహిళ క్యాటగిరిలో రెండు డైరెక్టర్ల గాను
పోత్తూరు భాగ్యలక్ష్మి, మూల తిరుమల దేవి, జనరల్ కేటగిరి ఆరు డైరెక్టర్లు లకు గాను నగునూరి పరమేశ్వర్, పోలు వెంకట రాజ్ కుమార్, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, హార్కల చక్రధర్, దాసరి రాంరెడ్డి, పూరెల్ల రాములు ఈరోజు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారని ఎన్నికల అధికారి ఏ కరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 341 ఓట్లకు గాను 288 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.