ఖమ్మం ప్రతినిధి జనవరి 5 (ప్రజాబలం) ఖమ్మం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, హైదరాబాద్ విజయవాడ లో ఉన్న కార్పొరేట్ వైద్యానికి దీటుగా ఖమ్మం నగరంలోని ప్రశాంతి హాస్పిటల్ లో పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు. ఖమ్మం నగరంలోని నెహ్రు నగర్ లో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పటల్ సేవలను మంత్రి తుమ్మల కొనియాడారు. అన్ని విభాగాలకు సంబంధించి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని అందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని అన్నారు. అనంతరం ప్రశాంతి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భరత్ బాబు మాట్లాడుతూ పదేళ్లుగా కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగానే వైద్యం అందించామని, కరోనా లాంటి సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి అనేకమందికి ప్రాణాలను కాపాడమని తెలిపారు గతంలో ఖమ్మంలో కిటికీలు కేరుంటే హైదరాబాదు లేక విజయవాడ ఆసుపత్రికి రోగులు తీసుకొని వెళ్తే మార్గమధ్యంలోనే వైద్యం అందక అనేకమంది మృతి చెందినటువంటి సంఘటనలు చూసి ఖమ్మంలోనూ ప్రశాంతి హాస్పిటల్ లో వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాం. అందుకే రోగుల ప్రాణాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా తక్కువ ఖర్చుతో పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటూ వారికి అండగా నిలుస్తున్నాం ఈ 10 ఏళ్లలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇలాగే అండగా నిలవాలని కోరుకుంటున్నాన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఖమ్మం మేయర్ నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, సాదు రమేష్ రెడ్డి, ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డా. కంభంపాటి నారాయణరావు, డా. జగదీష్ బాబు, ఆర్ఎంపీల సంఘం జిల్లా నాయకులు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు ఆసుపత్రి యాజమాన్యం ప్రశాంతి హాస్పటల్ వైద్యులు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.