ప్రజాపాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయాలి — జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ప్రజలు అందిస్తున్న దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ,గజ్వేల్ నియోజకవర్గం పరిధి లోని తూప్రాన్ మునిసిపల్ 11 వ వార్డ్ ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమమాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరుతెన్నులను, రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ప్రజలకు దరఖాస్తుఫారాలు అందుబాటులో ఉంచారా అని ఆరా తీశారు. దరఖాస్తులు పూరించేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, దరఖాస్తుల స్వీకరిస్తున్న కౌంటర్ల వద్దకు వెళ్లి అధికారులు స్వీకరించిన అప్లికేషన్లను స్వయంగా పరిశీలించారు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రసీదు అందించాలని, ప్రజలు సమర్పించే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను వెంటదివెంట రోజువారీగా ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేయాలని , దరఖాస్తులను ఆయా మండలాల ఎంపిడిఓ కార్యాలయాలలో భద్రపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివరాలను ఆన్ లైన్ లో కంప్యూటరీకరించే సమయంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత మండల స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. నిర్దేశిత గడువులోపు దరఖాస్తు వివరాల నమోదు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి ఏ ఓ శైలేష్ ,డి ఏం డబ్ల్యు జామ్లానాయక్ , మునిసిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ , కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్,తూప్రాన్ తహసిల్దార్ విజయలక్ష్మి , మునిసిపల్ కమీషనర్ కాజా మొహిద్దిన్, సీఐ శ్రీధర్, స్థానిక ఎస్సై శివానందం
ప్రజా ప్రతినిధులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking