ప్రజల్లో కేసీఆర్ పాలనపై అపనమ్మకం పెరుగుతోంది
రోజురోజుకి ఆ పార్టీ గ్రాఫ్ దిగజారుతోంది
ఎక్కడ చూసిన హస్తం పార్టీదే హవా
జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయబాబు
46, 15వ డివిజన్ లలో గడప గడపకు కాంగ్రెస్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 9(ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన జై కాంగ్రెస్ అంటున్నారన బీఆర్ఎస్ అంటేనే ఛీ కొడుతు న్నారని ఖమ్మం డీసీసీబీ మాజీ ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయబాబు పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని 46, 15వ డివిజన్ లలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు మువ్వా వివరించారు. తమ పార్టీకి ఓటు వేసి ఆశీర్వాదించాలని కోరారు. ఈ సందర్భంగా మువ్వా మట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ప్రజల్లో కేసీఆర్ పాలనపై అపనమ్మకం పెరుగుతోందని తెలిపారు. రోజురోజుకి ఆ పార్టీ గ్రాఫ్ దిగజారిపోతుందని విమర్శించారు. హస్తం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ప్రజలందరూ తహతహలాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మువ్వా తో పాటు కార్పొరేటర్ మలీదు జగన్, ఓబీసీ సెల్ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, బోడా శ్రావణ్ కుమార్, చల్లా రామకృష్ణ రెడ్డి, కాంపాటి వెంకన్న, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, శీతల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.