గోషామహల్‌ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గానికి అప్లికేషన్‌ వేసిన ఎన్‌ఆర్‌ లక్ష్మణ్‌రావ్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి పోటీ చేసే అభ్యర్థులను అసెంబ్లీ నియోజక వర్గాలుగా అభ్యర్థులు నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో అప్లికేషన్‌ సమర్పించుకోవాలని కోరిన సంగతి అందరికి తెలిసినదే. ఇందులో భాగంగా గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్టంలో స్థానిక ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ ను పార్టీనుంచి భహిష్కరించడంతో గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆశావాహకుల సంఖ్య పెరిగి పోయింది.శనివారంనాడు సీనీయర్‌ బీజేపీ నాయకులు భజ్రంగ్‌ సేనా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ఆర్‌ లక్ష్మణ్‌రావ్‌ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి తన అభ్యర్థితత్వాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ లక్ష్మణ్‌రావ్‌ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర భజ్‌రంగ్‌ సేనా ఆధ్వర్యంలో హిందువులపై జరిగే దాడికొ వ్యతిరేఖంగా ఎప్పుడు పోరాడుతూ ఉంటానాని వీటీని దృష్ఠిలో పెట్టుకుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనకు సీటు కేటాయిస్తుందని అన్నారు. బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్‌ హిందువాదం కోసం ఎన్నో పోరాటాలు చేసారని బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీ భహిష్కరణని ఎత్తివేసి రాజాసింగ్‌కు సీటు కేటాయించిన రాజాసింగ్‌ విజయానికి కృషి చేస్తానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking