జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 1
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పిఎస్ ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో ఆబాది జమ్మికుంట లో గల రైతు వేదికలో సర్వ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బందు రైతు భరోసా ముఖ్య ఉద్దేశం. రైతుల ఆలోచన విధి విధానాల గురించి చర్చించడం, రైతు సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపళ్లి రాజేశ్వరరావు, జిల్లా అధికారులు మనోజ్ కుమార్, శ్రీనివాస్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, దయ్యాల శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్లు, సంఘ సభ్యులు, రైతులు పాల్గొనడం జరిగింది.