స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల కొరకు దరఖాస్తుల స్వీకరణ

 

జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్వీరు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 01 : 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్వీరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3, 4 తేదీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ-సైక్లింగ్ వెలొడ్రోమ్ (9848464642), రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్-హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడమీ-ఖమ్మం (9490021220), హాకీ అకాడమీ-వనపర్తి (9866317321), వాలీబాల్ అకాడమీ – సరూర నగర్ (9866317303), వాలీబాల్ అకాడమీ-రాజన్న సిరిసిల్ల (9059465889)లో ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులు జనన ధృవీకరణ పత్రాలతో పాటు క్రీడలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ధృవపత్రాల నకలు ప్రతులతో ఈ నెల 3, 4 తేదీలలో సంబంధిత అకాడమీలలో రిపోర్టు చేయాలని, వివరాలు సంబంధిత నంబర్లలో సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking