అసభ్యకర పోస్టులపై పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు

 

జగిత్యాల ప్రతినిధి, జులై 10(ప్రజా బలం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైఎస్సార్ సీపీ నేతలు పెట్టిన పోస్టులపై జగిత్యాల జనసేన నేతలు జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జనసేన జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్ నేతృత్వంలోని జనసేన నాయకులు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ తోపాటు అభిమానులు, అనుబంధ సంఘాల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారని జనార్దన్ అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక వై.ఎస్ జగన్ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే తెలంగాణ జన సైనికుల, వీర మహిళల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని బెక్కం జనార్దన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చింత సుధీర్, శ్రీకర్, ఎదురుగట్ల ప్రభాకర్, అల్లెపు రమేష్, సంజీవ్, బొదాసు తిరుపతి, మహమ్మద్ హాజి, శివ, రాజు, రవి, మల్లేష్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking