జీవన్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్ల రుణాలను మాఫీ చేసింది “కేసిఆరే”

ఇందిరమ్మ ఇండ్లల్లో కేసీఆర్ ప్రభుత్వ వాటా ఉంది

ఓట్లడిగే నైతికత బీఆర్ఎస్ దే

లోన్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు

బీఆర్ ఎస్ సంక్షేమ లబ్ధిదారులను కాంగ్రేసోళ్లు ఓట్లడగొద్దు

జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 3:(ప్రజా బలం) బ్యాంక్ రుణాలను ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కట్టించిందని ఆ ఇండ్ల అప్పును కేసీఆర్ సర్కారు కట్టిందని అందుకే ఓట్లడిగే హక్కు కేసీఆర్ సర్కారుకే ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పదే పదే ఇందిరమ్మ ఇండ్ల ఓటర్లను ఓట్లడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదంటూ మాట్లాడతారన్నారు. ఆయన మాటలను చూస్తే నవ్వొస్తుందని నిజానికి కాంగ్రెస్ పార్టీ స్వంత నిధులతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించలేదని బ్యాంక్ లోన్లు ఇప్పించి ఇండ్ల నిర్మాణాలను చేపట్టారన్నారు. ఇందులోనూ రెండు నెలల్లో ఇల్లు కట్టుకొని లబ్ధిదారుల ఇండ్లను రద్దు చేస్తామని హెచ్చరికలు ఇచ్చారన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 వేలు, రూరల్ ప్రాంతాల్లో 25 వేల రుణాలను ఇచ్చారని మిగతా లబ్ధిదారులపై భారం మోపారన్నారు. తీరా ఇల్లు కట్టుకోలేక పోయిన ఎందరో బ్యాంకులకు బాకీ పడ్డారని వీరందరి అప్పులను కట్టి రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కారేనన్నారు. పదే పదే ఇందిరమ్మ ఇండ్లపై మాట్లాడే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు కాంగ్రెస్లోకి వచ్చాక అధికారంలో ఉన్న 15 ఎండ్లలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లను కట్టించారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిజానికి ఇందిరమ్మను తిట్టుకుంటూ ఆమె చనిపోయాక కాంగ్రెస్ లోకి వచ్చిన జీవన్ రెడ్డికి ఇందిరమ్మ ఇండ్లపై మాట్లాడే హక్కు లేదన్నారు. 3 వేల 9 వందల కోట్ల ఇందిరమ్మ ఇండ్లపై అప్పులు మాఫీ చేసిన కేసీఆర్ కు ప్రతి ఇంటిలో భాగస్వామ్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని వాస్తవానికి బీఆర్ ఎస్ పార్టీ కేసీఆర్ ప్రజలకు ఎంతో చేశారన్నారు. 1 లక్ష 75 వేల కోట్ల రైతుబందు ఇచ్చామని, 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామన్నారు. అలాగే 5 వేల 5 వందల కోట్ల రైతు భీమా అందించామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ ఎంతనో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషిచేశామని మీ ప్రభుత్వ హాయములో రైతుల పరిస్థితి ఎలావుండేదో అందరికి తెలుసన్నారు. 12 లక్షల మంది అడబిడ్డలకు కళ్యాణాలక్ష్మి, షాధి ముబారక్ పథకం కింద లబ్ది చేకూర్చామన్నారు. ఇప్పటివరకు 1 లక్ష 75 వేల కోట్లు బీడీ కార్మికులకు నెలకు 2 వేల రూపాయల పెన్షన్ వారి ఖాతాలో జమచేశామన్నారు. మీ పార్టీ కార్మికుల శ్రమ దోపిడీ చేసిందన్నారు. ఇక బిజెపి ప్రభుత్వం జిఎస్టీ పేరుతో పరిశ్రమనే మూత పడేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంత లబ్ది చేకూర్చారో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్ రూమ్ స్కీం లో ముస్లింలకు 15 శాతం కేటాయించిందని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే 80 శాతం ఇండ్లను బిసి, ఎస్సి, ఎస్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. గొల్ల కురుమలను అదుకొన్నామని చెరువులను తవ్వి చేప పిల్లలను వేసి మత్సకారులకు ఉపాధి కల్పించామన్నారు. చేనేత కార్మికులను అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఉపాధి చూపించక పోవడంతోనే బొంబాయి, బివండీలకు చేనేతలు వలస పోయారన్నారు. గౌడ కులస్తులకు చెట్టు పన్ను మాఫీ చేశామని భీమా సదుపాయం కల్పించామన్నారు. ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి గౌడ కులస్తులకు చేసిందేమిటో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు. మద్యం విక్రయాలతో మస్తు డబ్బొస్తుందని అంటున్న కాంగ్రెసోళ్ళందరు సోనియాగాంధీ పై ఒట్టు వేసి మందు మానేయ్యలని ఎమ్మెల్యే సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రతి ఇందిరమ్మ ఇంటిపై కేసీఆర్ భాగస్వామ్యం ఉందని వాళ్ళందరిని ఓట్లడిగే నైతిక అర్హత కేసీఆర్ పార్టీ బీఆర్ ఎస్ కు ఉందని అలాగే బీఆర్ ఎస్ సంక్షేమ పతకాల లబ్ధిదారులను ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి లేదని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు బాలే శంకర్, వొళ్ళం మల్లేశం, దూమాల రాజుకుమార్, జుంబర్తి శంకర్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking