ఇండియాలోనే నెంబర్ వన్ ట్రాక్టర్ సేల్స్ జాన్ డియర్

 

రైతుల శ్రేయస్సే మా లక్ష్యం

జాన్ డియార్ ట్రాక్టర్స్ ఇండియా హెడ్ శైలేందర్ జక్తాప్

మెదక్ చేగుంట ప్రాజబలం న్యూస్:-

ట్రాక్టర్ సేల్స్ లో జాన్ డియర్ కంపెనీ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని జాన్ డియార్ ఇండియా హెడ్ శైలేందర్ జక్తాప్ తెలిపారు. అత్యాధునిక హంగులతో మెదక్ -చేగుంట ప్రధాన రహదారి పక్కన ఏంసిహెచ్ సమీపంలో నిర్మించిన జాన్ డియర్ షోరూమ్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు మాకు దేవుళ్ళ లాంటి వారని ,వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. 24 ఏండ్ల లోనే ట్రాక్టర్ల అమ్మకాల్లో ఇతర కంపెనీలకు పోటీపడి దేశంలోనే 47 శాతం తో నెంబర్ వన్ గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.మెదక్ లో ఏర్పాటు చేసిన షోరూమ్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదని,సేల్స్ లోనూ ముందువరుసలో ఉందన్నారు.ఇప్పటికి 13 వేల ట్రాక్టర్లు విక్రయించినట్లు ఆయన తెలిపారు.అన్నదాతలకు గుడ్ సర్వీస్ ఇవ్వడంతోనే తమ కంపెనీ వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన తెలిపారు.రైతుల సౌకర్యార్థం మరిన్నీ బ్యాంచీలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.మా ప్రథమ ప్రాధాన్యం రైతుల శ్రేయస్సేనన్నారు.ప్రతియేటా ఇతర ట్రాక్టర్ల కంపెనీలకంటే ఎక్కువ ట్రాక్టర్లు విక్రయించడం జరిగిందన్నారు.మెదక్ షోరూమ్ లోనే సుమారు 300 మంది ఉపాధి పొందుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా బ్యాండ్ మేళాల మధ్య ఉద్యోగులు,సిబ్బంది నృత్యాలు చేస్తూ సందడి చేశారు.టపాసుల మోతతో షోరూమ్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో
ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ప్రభాస్ సెక్సేనా
సౌత్ జోన్ మేనేజర్ నవీన్ సెంగర్, డీలర్ డెవలప్మెంట్ మేనేజర్ పవన్ డీప్ సింగ్ ,ఏరియా మేనేజర్ కైలాష్
హనుమాన్ రాజ్ ,డీలర్ రాజేష్ యాదవ్,మెదక్ జనరల్ మేనేజర్ వెంకట్ రెడ్డి లతో పాటు ప్రజా ప్రతినిధులు,రైతు నాయకులు,రైతులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking