మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…
మెదక్ జిల్లా, మార్చి, 27 ప్రజా బలం న్యూస్ :-
ఫోన్ టాపింగ్ కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడని దొర అహంకారంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బుడ్డ భాగ్యరాజ్ కేటీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధి రాలేదని, కేటీఆర్ మతి భ్రమించి మితిమీరి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేటీఆర్ వెంట్రుకలు నమానాలను ఫోరెన్సికి టెస్టులకు పంపాలని డిమాండ్ చేశారు . బుధవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సవాలు విసిరితే నిజాలు బహిర్గతమైతావని భయపడి టెస్టులకు రాలేదని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ ఎంత మొరిగినా చట్టం తన పని తాను చేసుకొని పోతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు బయటకి వస్తాయని, అప్పుడు ఉంటది సూడూ బి.అర్.ఎస్ పార్టీ పని పడతాం అని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డభాగ్యరాజ్ అన్నారు.