ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి లోని బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పీక లక్ష్మణ్,బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు భూపెళ్లి అజయ్, పద్మా రెడ్డి,ఆధ్వర్యంలో బూడిది గడ్డ బస్తీలో చేరడం జరిగింది,వారితోపాటు 150 మంది కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ… బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిని గడ్డం వినోద్ చేసే కార్యక్రమాలను చూసి బీజేపీ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది అని అన్నారు.అంతేకాకుండా బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని గడ్డం వినోద్ గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది అని అన్నారు.