బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేరికలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 16 : మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం చిన్న గోపాలపూర్ గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బుధవారం వీరిని మాజీ ఎమ్మెల్సీ ఎఐసిసి నెంబర్ ప్రేమ్ సాగర్ రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సులేఖ ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఉప సర్పంచ్ పెంద్రం గోపాల్,లింగాల అశోక్, వినోద్, జూగతి కుర్సంగా,కొట్నాక్ మాణిక్ రావు,నవీన్,శ్రీను కొట్నాక్,కృష్ణ,భీమ్ రావు, దాదాపు 50 మంది చిన్న గోపాల్ పూర్ చేరడం జరిగింది,ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…కొక్కిరాల రఘుపతి రావు ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలకు ఆకర్షితు లై కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది తెలుపారు.ఈ కార్యక్రమం లోఎంపీటీసీ డేగ బాపు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని,లింగన్న,మేడపట్ల మల్లేష్,కొట్నాక జంగు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking