మనుషులు చనిపోయిన తరువాత నరక లోకంలో యమ ధర్మరాజు ఆస్థానంలో జీవుల పాప పుణ్యాల చిట్టా గణించి వారికి స్వర్గమో నరకమో తేల్చే బ్రహ్మ మానస పుత్రుడు చిత్రగుప్తుడి పంచ ఆలయాలలో అత్యంత అరుదైన ప్రక్యాథి గాంచిన అతి పురాతనమైన శ్రీ చిత్రగుప్తుడి దేవాలయం హైదరాబాద్ లోని కందికల్ గేటు ఛత్రినాక దగ్గర కలదు. ఈయన దేవాలయాలు హైదరాబాద్ లో కాకుండా బీహార్, కాంచీపురం, ఉజ్జయినీ, అయోధ్యలలో మాత్రమే కలవు. పవిత్రమైన ఆయుష్ హోమం, శ్రీ గణపతి హోమం, పితృలోక యజ్ఞం, పంచాగ్ని యజ్ఞం, అగ్ని హోమం, జల హోమం, ముక్తి-యోగ్యాలు, నిత్య-సంసారాలు శాంతి పూజ, సూర్యపూజ, చంద్ర పూజ, శుక్ర పూజ, బ్రయస్పతి పూజ, శని పూజ, మంగళ పూజ, రాహు పూజ, కేతు పూజ, కాలసర్ప దోస మతపరమైన పూజా కార్య కలాపాలన్నీ వైదిక నియమ నిబంధనల ప్రకారం నిర్వహించడానికి భక్తులు ఈ ప్రత్యేక దేవాలయానికి వస్తారని ఆలయ పూజారులు తెలియ జేసినరు. అమావాస్య సందర్భంగా శివరామ కృష్ణా, సీతారాందాస్, అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్, విజయలక్ష్మి తదితరులు దర్శనం చేసుకున్నారు.