స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్చా భారతదేశం.బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి, నిర్మల్ పట్టణం గాంధీచౌక్ లో నిర్వహించిన తిరంగా భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, లాంటి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ పాలకులను ఎదిరించి నేడు మనకు ఈ స్వేచ్చా భారతాన్ని అందించారని, ఆ అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్క భారత పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. మన భరత జాతి నిర్మాణానికి కృషిచేసిన వారి కలలు సాకారం చేసేందుకు మనమంతా సామరస్యంతో, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా దేశ సరిహద్దులో ఉన్న మన సైనికులు. సాయుధ దళాల జవాన్లు, దేశంలో అంతర్గత భద్రతకు తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలను గుర్తుచేసుకుంటూ వారందరికీ ప్రత్యేకంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, వోడిసెల అర్జున్, కొండాజీ శ్రావణ్, గిల్లి విజయ్, వివిధ మండలాల నాయకులు మరియు నిర్మల్ జిల్లా యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking