హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ పాత్రికేయులు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి గుండెపోటుతో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి పి సి సి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి కి విష్ణువర్ధన్ రెడ్డి స్వయాన సోదరుడు.
ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బుధవారం జమ్మికుంట పట్టణంలోని కృష్ణారెడ్డి నివాసానికి చేరుకొని మృతుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం పత్తి కృష్ణారెడ్డి కి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ విష్ణువర్ధన్ రెడ్డి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని మీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని వారికి తెలిపారు. అతి చిన్న వయసులోనే గుండెపోటు రావడం బాధాకరమని విష్ణువర్ధన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తు న్నట్లు ప్రణవ్ తెలిపారు. వోడితల ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లయ్య, గూడెపు సారంగా పాణి, మోలుగురి సదానందం, దేశిని కోటి, పూదరి రేణిక శివ,సాయిని రవి,శ్రీపతి నరేష్, బొంగొని వీరన్న, దిడ్డి రాము, సదానందం,రావికంటి రాజు, సుంకరి రమేష్,సొల్లు బాబు ,కొల్లూరి కిరణ్, రామరావు,రాజశ్వేర్ రావు,సలీం,ముద్ధమల రవి, పర్లపల్లి నాగరాజు, అన్నం ప్రవీణ్,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.