అనుమతికి మించి క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు

 

లక్షెట్టిపేట ఎంఈవో కాసుల రవీందర్

శ్రీ చైతన్య స్కూల్ సందర్శన

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించిన, బుక్స్,అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో రవీందర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 8 వ తరగతి పుస్తకాలను అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తిరుపతి కంప్లైన్ట్ చేయడంతో ఆ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా అయన విలేకరులతో మాట్లాడుతూ…ప్రతి పాఠశాల ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని,లేకుంటే స్కూల్ ను సీజ్ చేస్తామన్నారు.ఫీజు వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలన్నారు.పాఠశాలలో చదువు మాత్రమే చెప్పాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking