కాకతీయ కెనాల్ స్థలల్లో యదేచ్చగా వ్యాపార అడ్డాలు.

ఇసుక లారీలు, బారి క్రేన్లు, మొరమ్ డంప్పులు, ట్రాన్స్పోర్ట్ వాహనాల పార్కింగ్ కు కేంద్రాలు.

కెనాల్ కు చెందిన స్థలాలలో మట్టి నింపుతూ అడ్డాల తయారి.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 1:

ములుగు రోడ్డు నుండి దేశాయిపేటకు వెళ్ళే కాకతీయ కెనాల్ కు ఇరువైపుల స్థలాలు అడ్డా కేంద్రాలకు నిలయంగా మారాయి. ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతున్నారనే విధంగా కెనాల్ కు చెందిన స్థలాలను యదేచ్చగా అక్రమించుకుంటున్నారు. అందరూ చూస్తుండగానే కెనాల్ కు చెందిన స్థలాలలో పాత గృహాలు పడ కొట్టిన మట్టితో నింపేసి వ్యాపార కేంద్రాలకు అడ్డాలను తయారు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ములుగు రోడ్డు నుండి డిఎంహెచ్ఓ ఆఫీస్ వరకు ప్రధాన కెనాల్ ఆనుకొని ఉన్న కెనాల్ కు చెందిన రహదారిపై రేకుల షెడ్డులు వేసుకొని, ఆఫీసులు నిర్మించుకొని వారి వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు అంటే అధికారుల అండదండలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది. కెనాల్ కు చెందిన ఈ స్థలాలలో మొదట్లో ఇసుక లారీలు అడ్డాలకు నిలయంగా ఉండగా ఆ అడ్డలను ఆదర్శంగా తీసుకున్నారెమో కానీ ఆ పక్కనే విగ్రహాల తయారీ, భారీ క్రేన్ల అడ్డలు, తయారయ్యాయి. సెకండ్ డాక్టర్స్ కాలనీ దాటాక కెనాల్ రహదారి మీదుగా మొరం డంప్పులు కుప్పలుగా పోసుకొని గృహ నిర్మాణదారులు అడిగిన వెంటనే కుప్పలుగా ఉన్న మట్టిని జెసిబిలతో టిప్పర్లలో తరలిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇలా కెనాల్కు చెందిన స్థలాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకొని యదేచ్ఛగా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కెనాల్ కు ఒకవైపు వాణిజ్య కేంద్రాలను తయారు చేస్తుండగా మేమేం తక్కువ తిన్నామ అన్నట్లుగా ఫిల్టర్ బెడ్ వైపు కెనాల్ స్థలాలలో గృహ నిర్మాణాల తయారీ కోసం మెటీరియల్ సప్లై అడ్డ తయారు అయ్యింది. అది చాలాదన్నట్లుగా ఆ పక్కనే నివసిస్తున్న కొందరు వ్యక్తులు ట్రాన్స్పోర్ట్ వాహనాల పార్కింగ్ కోసం మేం వాడుకుంటే తప్పేంటని అంట్టు కాకతీయ ప్రధాన కాలువ స్థలాలలో మట్టితో నింపుతూ అడ్డాలు తయారు చేస్తున్నారు. అడిగిన వారిని బెదిరిస్తూ అందరి అడ్డాలు తొలగిస్తే మేము వెళ్ళిపోతామని లేదంటే ఇలాగే ఉంటామని, ఎవరికి అయినా చెప్పుకోండనీ అంటున్నారంట్టే కబ్జాదారుల బరితెగింపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే కాకతీయ కెనాల్ కు చెందిన సెంటు భూమి కూడా ఉండదని ఇలా పారి వాహనాలు కెనాలు వెంబడి వెళ్తుంటే కెనాల్ దెబ్బతినే అవకాశం ఉంటుందని అధికారులు స్పందించి అక్రమంగా ఉన్న అడ్డాలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. అడ్డాలను తొలగించడంలో ఇరిగేషన్ అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking