గాజుల అలంకరణలో మెరిసిన కాశీ విశాలాక్ష్మి,అన్నపూర్ణ

ఆకారపు వారి గుడిలో ప్రత్యేక అలంకరణ
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 4:
వరంగల్ స్టేషన్ రోడ్డులోని చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆకారపు వారి గుడిలో అధిక శ్రావణ మాసం శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ కాశీ విశాలక్ష్మి అన్నపూర్ణ దేవి అమ్మవారిలకి 11, వేల గాజులతో విశేష అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన పురోహితులు లంక శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గోపూజ నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్ వెంకట్రావు తీర్థ ప్రసాదలు అందేలా చూశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్ ట్రస్ట్ ఆకారపు హరీష్ స్వాతి దంపతులు, జగన్మోహన్ శర్మ, నాగలక్ష్మి, జానకి దేవి, కళావతి, వందన, విజయ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking