అన్నదానానికి లక్ష్యా 51 వేలు
జగిత్యాల జిల్లాలో వైభవంగా సీతారాముల కళ్యాణం
జగిత్యాల ప్రతినిధి, మార్చి 30, (ప్రజా బలం) జగిత్యాల జిల్లాలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభోగవముగా జరిపించాలని తలచిన ఎమ్మెల్సీ కవిత అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ రామాలయంలో రాములోరి కల్యాణానికి పట్టువస్త్రాలను పంపిన ఎమ్మెల్సీ కవిత హాజరైన భక్తులకు పసందైన భోజనాల ఖర్చుకై 50 వేల రూపాయలను పంపింది. అలాగే థరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ కవిత పట్టు వస్త్రాలతో ఒక లక్ష్య 116 రూపాయలను అన్నదాన కార్యక్రమం కోసం పంపగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక దంపతులు ఆయా ఆలయాల్లో పట్టు వస్త్రాలు, నగదును అందజేశారు. అలాగే
కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ఎమ్మెల్సీ కవిత అందించిన పట్టు వస్త్రాలు మల్యాల ఎంపీపీ మిట్ట పెల్లి విమల సుదర్శన్ అందజేశారు.ఇందులో జడ్పిటిసీ కొండపల్కల రామ్మోహన్ రావ్, సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి, జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేష్,పాల్గొన్న ఆలయ పాలక మండలి సభ్యులు,అర్చకులు పాల్గొన్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం వాల్గొండ రామ లింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత అందించిన పట్టు వస్త్రాలు సమర్పించి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత రాములోరి పెళ్లిని జగిత్యాల జిల్లాలో వైభవంగా జరిపించేందుకు చేసిన ఏర్పాట్లను చూసిన భక్తజనం ఎంతైనా ముఖ్యమంత్రి కూతురు ముఖ్యమంత్రి కూతురే..అంటూ జనం ప్రసంచించడం..ఎన్నికల్లో ఓటమి చెందినా జగిత్యాల ప్రజల మనసులను గెలుచుకొందని చర్చించుకోవడం కనిపించింది. జగిత్యాల లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు చుక్క నవీన్, వొద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, ఆలయ ఛైర్మెన్ లు కాశేట్టి తిరుపతి, బ్రహ్మాండ భేరి నరేష్ దంపతులు,కమిషనర్ డా.నరేష్, డి.ఈ రాజేశ్వర్, ఆలయకమిటీ సభ్యులు, నాయకులు, కౌన్సిలర్ లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.