విధ్యాకమిటి చైర్మన్ గొర్రె తిరుపతి యాదవ్
జగిత్యాల ప్రతినిధి, మార్చి 30,(ప్రజా బలం) శిక్షణ పొందిన ఉపాధ్యాయుల బోధనలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణా పూర్ ఎం.పి.యు.పి. స్కూల్ విద్యాకమిటి చైర్మన్ గొర్రె తిరుపతి యాదవ్ అన్నారు. బుధవారం రాత్రి జరిగిన ఎం.పి.యు.పి. స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు నిరంతరం కృషిచేస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ బడుల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేసిన టీచర్లు కేవలం ప్రభుత్వ బడులోనే బోధిస్తారని ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులోనే చేర్పించి నాణ్యమైన విద్యను అందిపుచ్చుకోవాలని గొర్రె తిరుపతి యాదవ్ కోరారు. వార్షికోత్సవ వేడుకలో విద్యార్థులు ప్రదర్శించిన సంసృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ దేవవ్వ, ఉప సర్పంచ్ పులి మనోహర్, ఎంపిటిసి మల్లారెడ్డి, విద్యాకమిటి సభ్యులు బాలయ్య
ఆ పాఠశాల హెచ్.ఎం. కృష్ణంరాజు, రమేష్ తోపాటు పలువురు ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు, పోషకులు, విద్యార్థులు ఉన్నారు.