రైతుకు కేసీఆర్ భరోసా

తెలంగాణ గొంతుక బీఆర్ ఎస్ ఎంపీ లు

అన్నదాతలను ఆదుకోవాలి

కల్లూరు లో జరిగిన రైతు భరోసా దీక్షలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కల్లూరు కెసిఆర్ అన్నదాతలకు అన్ని విధాల అండ దండలుగా ఉండి రైతుబంధుగా పేరుగాంచి, రైతులను అన్ని విధాలా ఆదుకున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పిలుపు మేరకు శనివారం కల్లూరు లో జరిగిన రైతు భరోసా దీక్షలో నామ పాల్గొని మాట్లాడారు .బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతు పక్షాన నిలబడి ఉందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ వాణి బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలన వల్ల ప్రజలు తాగు ,తాగు నీరు అందక నరక యాతన అనుభవిస్తున్నారని అన్నారు సరైన సమయంలో సాగునీటిని ఇవ్వ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయి తీవ్ర నష్టానికి గురయ్యారని చెప్పారు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, వారికి ఇస్తానన్న రూ. 500బోనస్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు .
పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంపీలు రైతులకు అండగా ఉండి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని చెప్పారు .

KCR assurance to all the farmer

వాళ్ళ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు కొట్లాడడం జరిగిందని గుర్తు చేశారు తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని, ఆనాడు 25 లక్షల మంది దుబాయి, ముంబాయి వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి కూలినాలి చేసుకునే వారని ,కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసి, పెద్ద ఎత్తున పంటలు పండించి సంతోషంగా జీవించారని అన్నారు. కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, పంటలు ఎండిపోయి, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం గోదావరి నీటిని 600 మీటర్ల పైకి తీసుకొచ్చి వదిలిపెట్టి తద్వారా రైతులకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని , ఇది ఒక చరిత్ర అన్నారు.కెసిఆర్ రైతు పక్షంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున పంటలు సాగు జరిగినాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అన్ని ఒట్టి బూటకమని కొట్టి పారేశారు కాళేశ్వరంపై తన పార్లమెంట్లో అనేక ప్రశ్నలు అడిగిన సందర్భం లో కేంద్రం స్వయంగా అవినీతి లేదని , ఎనభై వేల కోట్ల వరకు ఖర్చు చేశారని,తద్వారా సాగు, తాగునీరు అందిస్తున్నారని వివరించడం జరిగిందని నామ గుర్తు చేశారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ నామ రైతు బిడ్డని ,రైతు కష్టాలు తెలిసిన మంచి మనిషి అని అన్నారు పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చినప్పుడు నామా ఎంపీలను సమీకరించి కేంద్రంపై పెద్ద ఎత్తున కొట్లాడి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన పోరాట పటిమ గల నాయకుడని కొనియాడారు
నామ ను మంచి మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్ కు పంపించాలని రవిచంద్ర విజ్ఞప్తి చేశారు .ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ నాయకులు పాలెపు రామారావు , వెంకటేశ్వరరావు దొడ్డ శ్రీనివాసరావు వెంకట లాల్ కొత్తూరు ఉమామహేశ్వరరావు
చారి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు

Leave A Reply

Your email address will not be published.

Breaking