:100కోట్ల కు పైగా నిధులతో యువత కలలకు ఆసరా గా నిలిచిన సీఎం కేసీఆర్
:దేశంలోనే తొలి భారీ యువజన పథకం
: ఊరూరా క్రీడా ప్రాంగణాలు… వాటన్నింటా క్రీడా పరికరాలు
: తెలంగాణ యువలోకంలో కొత్త కాంతులు
:మన రాష్ట్రం ఆచరిస్తున్నది.. దేశం అనుసరించక తప్పదు
: మోదీ ది ఖేలో ఇండియా కాదు..కూలే ఇండియా
: కాంగ్రెస్ పాలనలో క్రీడల్లోను స్కాం లే
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
వరంగల్ అక్టోబర్ 4 ;దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ రాష్ట్ర నవతరానికి గొప్ప వరమని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో జరిగిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హాజరయ్యారు.పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తో కలిసి కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ ను యువత కు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ భారత దేశంలో నే భారీ యువజన, క్రీడాభివ్రృద్ధి పథకం గా కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ స్కీం చరిత్ర లో ఎప్పటికీ నిలుస్తుందన్నారు.రైతు బందు,భీమా, కేసీఆర్ కితదితర గొప్ప ప్రభుత్వ పథకాల వరుసలో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ కూడా యువత కు ఆసరా నిలిచి,వారి కలల సాకారానికి బాటలేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా విలువైన స్థలాలను కేటాయించి,గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన సీఎం కెసిఆర్ , యువ లోకానికి దారి దీపం గా నిలిచారని అన్నారు.ప్రతి గ్రామం లో క్రీడా ప్రాంగణం…వాటి నిండా క్రీడా పరికరాలు ఏర్పాటు చేసిన సీఎం కెసిఆర్ గ్రామాల్లో కొత్త ఉత్సాహం కల్పించారని అన్నారు.తెలంగాణ ఆణిముత్యాలైన ఈషా సింగ్,నిఖత్ జరీన్ తదితర క్రీడా కారులకు కోట్ల రూపాయల నగదు బహుమతి, బంజారాహిల్స్ లో 700గజాల విలువైన ఇండ్ల స్థలాలను సీఎం కేసీఆర్ అందజేసి ప్రోత్సాహించడం వల్లనే అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర యువకులు పతకాలు పండిస్తున్నారని వివరించారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలోనే భారీ క్రీడా ఈవెంట్ లా స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన సీఎం కప్ పోటీ లలో రాష్ట్రం లోని రెండున్నర లక్షల మంది యువకులు పాల్గొని,యువ సంబురం గా జరుపుకున్నారని తెలిపారు.దాంతో పాటు మహిళా విమెన్ చెస్ చాంపియన్ షిప్,ట్రై క్రీడా వేడుకలు, చలో మైదాన్ తదితర భారీ క్రీడా ఈవెంట్ లలో వేలాదిమంది యువకులు భాగస్వామ్యులయ్యరని వివరించారు.ఇటీవల చేపట్టిన చలో మైదాన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది యువకులు పాల్గొన్నారని అన్నారు.గత పదేళ్ల లో లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తో పాటు ఐటీ, ప్రయివేట్ రంగం లో 85వేల పరిశ్రమల ఏర్పాటు కు సహకరించి ప్రయివేట్ రంగం లో దాదాపు 16లక్షల ఉద్యోగాలు యువతరానికి లభ్య మయ్యేలా సీఎం కెసిఆర్ దారులేసారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాం లో క్రీడా ల్లోనూ స్కాం లే నని,2010 కామన్ వెల్త్ గేమ్స్ లో నూ దాదాపు 70వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు.మోదీ సర్కార్ “ఖేలో ఇండియా నినాదమిస్తూ ఖతం ఇండియా ” కార్యక్రమాన్ని అయలుపరుస్తున్నదని దుయ్యబట్టారు.60 కోట్ల కు పైగా ఉన్న యువతకు ఖేలో ఇండియా పేరుతో కేవలం 45 లక్షల కోట్ల దేశ బడ్జెట్ లో కేవలం వెయ్యి కోట్ల నిధులే కేటాయించడం దారుణమని , వాటి లోనూ దాదాపు 600 కోట్ల నిధులు బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేశారని విమర్శించారు.అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కెసిఆర్ 450కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేశారని వివరించారు.ఎంఎల్ఏ చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గాలి మాటలు చెప్పే కాంగ్రెస్, బిజెపి పార్టీ లను నమ్మొద్దని, ప్రజా సంక్షేమ కేసీఆర్ సర్కార్ నే బలపరచాలని కోరారు.కరెంట్ బాధలను దూరం చేయడం తో పాటు రైతు, మహిళా లోకానికి సీఎం కెసిఆర్ ఎంతో మేలు చేశారని తెలిపారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆంజనేయ గౌడ్ ను ఎంఎల్ఏ మరియు ఇతర ప్రజాప్రతినిధులు గజ మాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి, జెడ్పీటీసీ, సర్పంచ్ లు, అధికారులు, యువత, మండలం లోని వివిధ గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.