మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ బుడ్డ భాగ్యరాజ్ & డాక్టర్ అప్సర్ & గరిగేనర్సింగరావు
మెదక్ ప్రాజబలం న్యూస్ :-
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్,గరిగే నర్సింగరావు, మహమ్మద్ అప్సర్ మండిపడ్డారు. దేశంలో నియంతలు ,శాడిస్టులు, సైకోలు ఎవరో దేశ ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. 25 రోజుల్లో 18 వేలకోట్ల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని సైకో అంటే అన్నం పెట్టే రైతులను గాలికి *వదిలేసి పెట్టుబడిదారులకు పట్టం కడుతున్న మోదీని ఏమని పిలవాలో ఈటెల రాజేందర్ చెప్పాలన్నారు గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఇండ్లు కోల్పోయిన 1000 కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా బిజెపి సర్కార్ గాలికి వదిలేసింది నిజం కాదా అని ప్రశ్నించారు .
ఈటల రాజేందర్ చౌకబారు విమర్శలతో తన స్థాయిని తగ్గించుకోవద్దని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ హితువు పలికారు.