ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని ఖానాపురం హవేలీలో వడ్లమూడి ఈశ్వరమ్మ కుటుంబం పోలీసుల వేధింపులతో భయపడి, చట్టపరమైన వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇంటి నుండి బలవంతంగా బయటికి పంపబడ్డారు 2024 అక్టోబర్ 3న అర్థరాత్రి సుమారు 1.30 గంటలకు ఈశ్వరమ్మ ఇంటి తలుపులు కొట్టడంతో ప్రారంభమైన ఈ ఘటన తీవ్ర ఆందోళనను కలిగించింది గౌరీశెట్టి గోవర్ధన్ చోదవరపు భవాని మర్రి మంగమ్మ, మర్రి వీరస్వామి పెద్ది ధనంజయ (ట్రాఫిక్) ఎస్ఐ వెంకన్న ఖానాపురం హవేలీ పోలీసు సిబ్బందితో కలిసి వచ్చారు ఈశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులను ఇంట్లో ఉన్నవారిని తీవ్రంగా బెదిరించి స్టేషన్ తీసుకెళ్లారు ముఖ్యంగా ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు వడ్లమూడి నాగేశ్వరరావు వారికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి ట్రాఫిక్ ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో ఖానాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు వాహనంలో కానిస్టేబుళ్లు వారి ఇంటి గేటుకు తాళం వేసి, ఈశ్వరమ్మను తెల్లవారుజామున 3.30 గంటలకు బల్లెపల్లిలోని వారి చిన్న కుమారుడు వడ్లమూడి నరేంద్రబాబు ఇంటి వద్ద దింపారు ఈ మొత్తం వ్యవహారం ఇప్పటికే ఖమ్మం కోర్టు మరియు హైదరాబాద్ హైకోర్టు పరిధిలో ఉన్న కేసు పరిస్థితుల్లో పోలీసుల కక్షపూరిత చర్యగా అభిప్రాయపడ్డారు ఈశ్వరమ్మ. అక్టోబర్ 4న హైకోర్టులో విచారణకు వెళ్లాల్సిన కేసు నేపథ్యంలో అక్టోబర్ 3 అర్థరాత్రి ఈ ఘటన జరిగి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యమని ఆమె ఆరోపించారు న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉందని మాకు పూర్తిగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము వారు కావాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా న్యాయం మా వైపే ఉంటుందని మేము నమ్ముతున్నాము పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయం మాకు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు