బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నాయకులు రాజీనామా

 

రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మొటపలుకుల గురువయ్య

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 05 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.మంగవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చెసిన నాయకులు మంచిర్యాల జిల్లా రైతు సమన్యయ సమితి జిల్లా కన్వీనర్ మొటపలుకుల గురువయ్య తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అనాలోచిత, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం,గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా విస్మరించినదని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ముత్తె బాపు,రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking