ఎవరూ ఆందోళన, అధైర్య పడవద్దు,నిత్యం ప్రజల్లోనే ఉంటాను,శ్రీ హరిరావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా

 

నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకవేళ ప్రజలు గెలిపించి ఉంటే ఉద్యమ స్ఫూర్తితో ,అంకితభావంతో పనిచేద్దామని అనుకున్నానని.. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాను నిర్మల్ లోకాంగ్రెస్ గెలవకపోయినా.. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని అధికారం చేపట్టనుంది. ఎవరూ ఆందోళన, అధైర్య పడవద్దు ,నిత్యం ప్రజలతోనే ఉంటాను, ప్రతి సమస్యపై పోరాడతాను ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పరిష్కారం కోసం పనిచేస్తాను .కొందరు నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు నేను కేసీఆర్ మనిషినని,ఒక నాయకునికి అమ్ముడు పోయానని దుష్ప్రచారం చేశారు.ఎన్నికలలో గెలవాలంటే చేసిన పనులు చెప్పి గెలవాలే తప్ప ఇల తప్పుడు ప్రచారాలు చేస్తే సమయమే నిజమేంటో నిగ్గు తేలుస్తుందని ,కాలమే సరైన సమాధానం చెబుతుందని.. రాష్ట్రంలో దుష్ట పాలన పోయి ప్రజా పాలన వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రతిఫలాలు అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను.రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినందుకు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు .

Leave A Reply

Your email address will not be published.

Breaking