ఎగ్జిట్ పొల్ ఫలితాల లో 98% వాస్తవ ఫలితాలు వెల్లడి చేశాము …చాణక్య స్ర్టాటజిస్ సంస్థ సంస్థ చైర్మన్ ముఖేష్

సోమాజిగూడ/మేజర్ న్యూస్:3
ఎగ్జీట్ పోల్ ఫలితాల ను 98% కచ్చితత్వం తో ఇచ్చామని , తాము ప్రతీ నియోజకవర్గం లో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఈ కచ్చితమైన ఫలితాల ను ప్రజల ముందు వుంచగలిగామని , ప్రతీ పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 శాంపిల్స్ సేకరించి ఖచ్చితమైన రిపోర్ట్ సాధ్యమైంది అని చాణక్య సర్వే సంస్థ చైర్మన్ ముఖేష్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బి.అర్.ఎస్ పార్టీ మీద యువత, నిరుద్యోగులు పూర్తీ వ్యతిరేకతను స్పష్టం గా చూపించారనీ, ప్రజలు తీవ్రంగా మార్పు కోరుకోవడం, ఇతర అంశాలు తీవ్రంగా ప్రభావం చూపాయనీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని, కెసిఆర్ నిరంకుశ పాలనకు అంతం పలకాలని ప్రజలు ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ పార్టీ వైపూ మొగ్గు చూపారు అని ఆయన వెల్లడించారు. కేవలం రెండు టికెట్ల విషయంలో తమ అంచనాలు తప్పాయనీ,
మహానగర పరిధిలోని ప్రజలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ కు మద్దతు పలికారనీ పేర్కొన్నారు. గతంలో కూడ తమ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు వాస్తవాల కి దగ్గరగా వున్నాయని,తాము ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసిన 26 మంది ఎమ్మెల్యేల కి వ్యూహకర్తలు గా పని చేశామని వారందరూ కూడా విజయం సాధించారు అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking