హైదరాబాద్ ఫిబ్రవరి 24 ();వికలాంగుల హక్కుల కోసం 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న కొల్లి నాగేశ్వరరావు కు గుర్తింపు లభించింది.సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారు ప్రకటించిన జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగాఅఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు నియమిస్తూ ఉత్తరంలో జారీ చేశారు.కొల్లి నాగేశ్వరరావు గత 24 సంవత్సరాలుగా వికలాంగుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన నాయకుడు. గతంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిత్వ శాఖ సభ్యుడుగా, పలు కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన అనుభవం. ఈ సందర్భంగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలం కోసం పోరాడుతానని ముఖ్యంగా దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లు ధనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం, నిరుద్యోగంతో బాధపడుతున్న సకలాంగులు వికలాంగులు కొరకు ప్రత్యేకంగా స్వయం ఉపాధి కింద స్టాల్ ఏర్పాటు కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు