జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం ప్రధాన కార్యదర్శిగా ‘‘కోట దామోదర్‌’’

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి :జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన కాలమిస్ట్‌, రచయిత కోట దామోదర్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్‌, రాష్ట్ర అధ్యక్షుడు మాడా రాజా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కోట దామోదర్‌ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం అంకితభావంతో చేనేత వర్గాల సమస్యలపై స్పందించి వాటిని మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి చేరే విధంగా, చేనేత కార్మికులకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. నియామకానికి సహకరించిన అవ్వారు మల్లికార్జున్‌, రుషింగప్ప, మాడ రాజా గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking