కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ సస్పెండ్ చేసిన కలెక్టర్

పాఠశాల, అంగన్వాడీలో నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవు

భోజన నాణ్యత పర్యవేక్షణలోపంతో ఉపాధ్యాయురాలికి మెమో. పల్లె ప్రగతిలో చేపట్టే ప్రతి పనిని 100 శాతం చేపట్టి నిర్వహించాలి. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. శనివారం కుల్కచర్ల మండలం. పీరంపల్లి లో ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లె ప్రగతి కింద చేపట్టిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డ్ లను అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను సందర్శించి వంటశాల గదిని, పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు, బాలింతలకు భోజనం, గుడ్లు, బాలామృతం సరిగ్గా ఇవ్వడం లేదని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా… దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గ్రహించిన కలెక్టర్ అంగన్వాడి టీచర్ వెంకటమ్మను సస్పెండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో భోజనం నాణ్యతలో లోపాన్ని గుర్తించిన కలెక్టర్ పర్యవేక్షణలోపం కారణంగా ఉపాధ్యాయురాలికీ మెమో జారీ చేయనైనది. ఇలాంటిది ఇకమీదట పునరావృత్తం అయితే చర్యలు తప్పవని మండల విద్యాధికారిని కలెక్టర్ హెచ్చరించారు.

Kulkacharla Mandal Peerampally Village Anganwadi Teacher Suspended Collector

పల్లె ప్రగతి లో భాగంగా నిర్వహిస్తున్న నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ , పల్లె ప్రకృతి వనంను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో చేపట్టే పనులపై కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పల్లె ప్రగతిలో చేపట్టే లక్ష్యాలను అన్ని వాడుకలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి వనమును వాడుకలోకి తీసుకురావడమే కాకుండా ఎప్పుడు పచ్చగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాచర్లు (వన సంరక్షకులు) సక్రమంగా పనిచేయినట్లైతే కొత్తవారిని నియమించుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోకు సూచించారు. డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరే చేసుకోవాలని అదేవిధంగా కంపోస్ షెడ్డులో చెరువులను తయారు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీలోని ఇంకా ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకుంటూ వచ్చే హరితహారానికి వినియోగించుకునేలా సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలను వాడుకలోకి తీసుకువచ్చి వాటిని పార్కుల మాదిరిగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు. పది రోజుల్లో పల్లె ప్రగతి పనులను పూర్తి చేసి వాడకల్లోకి తీసుకురానట్లయితే మండల అధికారులతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

శిశువుకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మే

Kulkacharla Mandal Peerampally Village Anganwadi Teacher Suspended Collector
గర్భం దాల్చినప్పటి నుండి మొదలుకొని శిశువుకు జన్మనిచ్చేంత వరకు గర్భిణీలకు సేవలందించాలని ఆశ వర్కర్, ఏఎన్ఎం లకు కలెక్టర్ సూచించారు. శిశువుకు జన్మనివ్వడం పునర్జన్మేనని అలాంటి తల్లికి అంగన్వాడి, ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుండి మొదలుకొని డెలివరీ అయిన ఆరు నెలల వరకు గుడ్లు, బాలామృతం అందించాలని కలెక్టర్ తెలిపారు.

డెలివరీ అయిన తల్లులకు ఫోన్ చేసి మాట్లాడిన కలెక్టర్

డెలివరీ అయిన తల్లులకు ఫోన్ చేసి వారి బాగోవులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి నుంచి అందాల్సిన గుడ్లు, బాలామృతం పై ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్త తీసుకొని క్షేమంగా ఉండాలని సూచించారు.

ఉపాధ్యాయులు పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతోపాటు ప్రతి విషయంలోను అవగాహనగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. పిల్లలను కోపపడకుండా వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో స్థానిక సర్పంచ్ రాధిక సోమలింగం, ఎంపీడీవో ఎంపీవో , ఏపీవో ఫీల్డ్ అసిస్టెంట్, స్థానిక ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking